ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వామి వారిని దర్శించుకుని పత్యేక పూజలో పాల్గొన్నారు. ముక్కోటి ద్వారం ముందట లక్ష్మీనరసింహస్వామికి పుష్ప వేదికపై ఆలయ పూజారులు వేద ఘోష నిర్వహించారు.
ధర్మపురి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు - ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలన్ని పండగ శోభను సంతరించుకున్నాయి. వేకువజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు.
ధర్మపురి ఆలయంలో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు
పండగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మపురి ఆలయ ఉత్తరద్వారం గుండా వేలాది మంది లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారికి తమ మొక్కులు చెల్లించుకున్నారు.
ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు