ముక్కోటి ఏకాదశి సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల పట్టణాల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నిర్వాహకులు ఆలయాన్ని వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మెట్పల్లి, కోరుట్లలో ముక్కోటి ఏకాదశి వేడుకలు - Korutla Mukkoti Ekadashi celebrations
జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్లలో ముక్కోటి ఏకాదశి వేడుకల సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దంపతులు ఉత్తరద్వార దర్శనం ద్వారా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
మెట్పల్లి, కోరుట్లలో ముక్కోటి ఏకాదశి వేడుకలు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్సవమూర్తులను ఊరేగించారు. అనంతరం భక్తులకు దర్శనం ప్రారంభించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో భక్తిభావాన్ని చాటాయి.
ఇదీ చూడండి:సర్వాంగ సుందరంగా ముస్తాబైన యాదాద్రి సన్నిధి