ప్రభుత్వం, రైస్ మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై అన్నదాతలను అవస్థల పాలు చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. జగిత్యాల జిల్లా జగ్గాసాగర్లోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. రోజులు గడుస్తున్నా ఏదో ఒక సాకు చెబుతూ కొనుగోలులో అధికారులు జాప్యం చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు.
జగిత్యాల జిల్లా రైతులే ఎక్కువ నష్టపోతున్నారు: ఎంపీ అర్వింద్
జగిత్యాల జిల్లా జగ్గాపూర్ లోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ ధర్మపురి అర్వింద్ పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యల గురించి తెలుసున్నారు. ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన చేపట్టాలని సూచించారు.
కొనుగోళ్లపై అసంతృప్తి వ్యక్తం చేస్తు కలెక్టర్ రవితో ఫోన్లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఎంపీ కోరారు. రైతులు పంట పండించడానికన్నా… ఎక్కువ కష్టం, పంట అమ్ముకోవడానికి పడుతున్నారన్నారు. తరుగు, తాలు పేరిట అడ్డగోలుగా దోపిడి చేస్తున్నారన్నారు. కొనుగోళ్లు ఇప్పటి వరకు 40 శాతం కూడా పూర్తి కాలేవన్నారు. అన్ని జిల్లాలతో పోలిస్తే జగిత్యాల జిల్లా రైతులే తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి కొనుగోళ్లను త్వరితగతిన పూర్తిచేసి అన్నదాతకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు.