తెలంగాణ

telangana

ETV Bharat / state

'నంబర్'​ ప్లేటు మార్చాడు... పట్టుబడ్డాడు - ఈ చలాన్

ఈ చలాన్‌తో రెండు నంబర్ల బాగోతం బట్టబయలైంది.. నకిలీ వ్యక్తులు దర్జాగా తిరుగుతూ  నిబంధనలు అతిక్రమించి ట్రాఫిక్‌ పోలీసులకు దొరకగా.. అసలు వాహనదారులకు ఈ చలాన్‌ రావటం వల్ల  బాగోతం బయట పడింది.

most of the people are cheating by keeping duplicate number plate to the vehicles

By

Published : Jul 21, 2019, 4:59 PM IST

Updated : Jul 21, 2019, 11:42 PM IST

'నంబర్'​ ప్లేటు మార్చాడు... పట్టుబడ్డాడు

జగిత్యాల జిల్లా జాబితాపూర్​కు చెందిన లవకుమార్​ అనే యువకునికి ఏపీ15బీఏ5036 ద్విచక్రవాహనం ఉంది. కరీంనగర్​లో ట్రాఫిక్​ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఈ చలాన్​ ద్వారా జరిమానా పంపారు ట్రాఫిక్​ పోలీసులు. అసలు తాను కరీంనగర్​కే వెళ్లలేదని... ఏదో పొరపాటు జరిగిందని బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అదే నంబరుతో మరో వాహనం కరీంనగర్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై ఆరా తీయగా నకిలీ నంబరుతో ట్రాఫిక్​ నిబంధనలు అతిక్రమించి దర్జాగా తిరుగుతున్న వ్యక్తి దొరికాడు. గతంలోనూ ఓ ఆటో నడిపే వ్యక్తికి చలానా ద్వారా జరిమానా పంపగా ఆరా తీసిన పోలీసులు నకిలీ నంబరుతో తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు.

వాహనదారులకు ఈ చలాన్​ రావడం వల్ల పలుమార్లు నకిలీ నంబర్ల బాగోతం బయటపడింది. ఇలా నకిలీ నంబర్​ ప్లేటు బిగించుకుని దర్జాగా తిరిగేవారిని గుర్తించి, చర్యలు తీసుకుంటామని జగిత్యాల ట్రాఫిక్​ ఎస్​ఐ ఆరోగ్యం తెలిపారు.

Last Updated : Jul 21, 2019, 11:42 PM IST

ABOUT THE AUTHOR

...view details