తెలంగాణ

telangana

ETV Bharat / state

నువ్వు చెప్పినట్టే పంట వేస్తే ఏం మిగిలింది కేసీఆర్​ సారూ.. - జగిత్యాల జిల్లాలో దోమపోటుకు గురైన వరిపంట

ఆరుగాలం కష్టించి పండించిన వరిపంట దోమపోటుకు గురైంది. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడం వల్ల ఆవేదన చెందిన రైతులు... పంటకు నిప్పుపెట్టారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

వరిపంటకు దోమపోటు... నిప్పంటించిన రైతులు
వరిపంటకు దోమపోటు... నిప్పంటించిన రైతులు

By

Published : Nov 1, 2020, 8:31 AM IST

పండించిన వరి పంట దోమపోటుకు గురి కావడం పట్ల ఆవేదన చెందిన జగిత్యాల జిల్లా రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు నిప్పంటించారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తికి చెందిన రైతు శ్రీధర్... 4 ఎకరాల్లో సన్నరకం వరి ధాన్యాన్ని సాగుచేశారు. పంటకు దోమపోటు సోకింది. పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని ఆవేదనకులోనైన శ్రీధర్... పంటకు నిప్పు పెట్టి ప్రభుత్వానికి నిరసన తెలిపారు.

నువ్వు చెప్పినట్టే పంట వేస్తే ఏం మిగిలింది కేసీఆర్​ సారూ..

కేసీఆర్​.. సారు దండంపెట్టి చెప్తున్న... సన్నరకం వరిపండిస్తే దోమపోటుకు గురైంది. నువ్వు చెప్పినట్లే పండిస్తే మొత్తం నష్టపోయినం. నాలుగు ఎకరాల్లో పంటనష్టం వచ్చింది. పురుగుల మందు డబ్బా కొని చావడమే మాకు శరణ్యం.

- బాధిత రైతు

కథలాపూర్ మండలం పెగ్గర్లలో రైతు తిరుపతి... తనకున్న రెండున్నర ఎకరాల్లో సన్నరకం వరిసాగు చేశారు. దోమపోటు సోకి పంట పూర్తిగా దెబ్బతినగా ఆవేదనకు లోనయ్యారు. పంటకు నిప్పంటించి నిరసన తెలిపారు. సన్నరకం వరిసాగు చేస్తే పూర్తిగా నష్టపోయానని... ప్రభుత్వమే తనని ఆదుకోవాలని బాధిత రైతు వేడుకున్నారు.

ఇదీ చూడండి:అబద్ధమని నిరూపిస్తే సీఎం పదవికి రాజీనామా చేస్తా: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details