MLC Kavitha Fires on Rahul Gandhi : రాహుల్ గాంధీ అప్డేటెడ్ లేని అవుట్ డేటెడ్ నాయకుడు అయిపోయారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ఆరోపణ చేశారు. ఊహకందని విధంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే(BRS).. అభివృద్ధి చేసేది కూడా తమ ప్రభుత్వమేనని తెలిపారు. జగిత్యాల జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం(BRS MEETING)లో ముఖ్య అతిథిగా కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్సీ రమణ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వంటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత బీజేపీ, కాంగ్రెస్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇదే చివరి అవకాశం అంటారని.. మరి అతనిని నమ్ముదామా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. నాయకులంటే ఇలాగే ఉంటారా అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసే పార్టీనని దుయ్యబట్టారు. అందుకే ఒకప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీ.. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితం అయిందని విరుచుకుపడ్డారు.
BRS Congress Debate on SC ST Declaration : ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్‌పై రగడ.. ఆగని అధికార, విపక్షాల గలాట
"కాంగ్రెస్ వాళ్లు రూ.4000 ఫించన్ ఇస్తారంటూ.. నమ్ముతామా వారి మాటలు. ఇక రేపు 17వ తేదీన గాంధీ పరివారం అంతా హైదరాబాద్‌లో దిగుతుందట. దేశవ్యాప్త సమావేశాలు మొత్తం హైదరాబాద్‌లోనే పెడుతున్నారంట. నిజంగా గమ్మత్తుగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకో తెలుసా నిన్నకాక మొన్న రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. మొన్ననే ఖర్గే వచ్చి ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ఇచ్చి వెళ్లారు. ఏమంటున్నారు మేము వచ్చి పోడు పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. మరి అప్డేట్ కారా.. మొన్ననే బీఆర్ఎస్ పోడు పట్టాలను పూర్తిగా పంచేసింది. రాహుల్ గాంధీ అప్డేటెడ్ లేని అవుట్ డేటెడ్ నాయకుడు అయిపోయాడు. ఆయన మోదీని ఆపలేకపోతున్నారు అందుకే కేసీఆర్ అడ్డుకోవాలనుకుంటున్నారు. కేసీఆర్ స్పీడ్‌ను అడ్డుకోవడం రాహుల్ గాంధీ తరం కాదు. అందుకే కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అయింది."- కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
BRS Meeting in Jagitya : ఇది కార్యకర్తల సభలా కాదు మహాసభలా కనిపిస్తోందని.. వేరే పార్టీల సభలన్నీ వెలవెల పోతున్నాయని చెప్పారు. ఇందుకు స్ఫూర్తిని ఇచ్చింది సీఎం కేసీఆర్.. ఆయన సీఎం ఉన్నందువల్లే నీళ్లు, నిధులు, నియామకాల్లో నంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. వాస్తవానికి దేశంలో ఎక్కడ కూడా ప్రత్యేక ఉద్యమాలు సక్సెస్ కాలేదు.. కానీ ఒక్క తెలంగాణలోనే ఉద్యమాలు చేపట్టి విజయం సాధించింది కేసీఆర్‌నే అని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాదినే పోడు పట్టాలు ఇస్తే.. రాహుల్ గాంధీ అప్డేటేడ్ లేని అవుట్ డేటేడ్ నేతగా.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పోడు పట్టాలిస్తానని చెప్పడం ఏంటని దుయ్యబట్టారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని.. అభివృద్ధి చేసేది తమ ప్రభుత్వమేనని కవిత తెలిపారు.
MLC Kavitha Fires on Rahul Gandhi రాహుల్ గాంధీ అప్డేటెడ్ లేని.. అవుట్ డేటెడ్ నాయకుడు KTR Tweet on BRS Candidates List : టికెట్ దక్కని అభ్యర్థులకు మరోరూపంలో అవకాశం ఇస్తామన్న కేటీఆర్.. మైనంపల్లి వ్యాఖ్యలపై సీరియస్
BRS MLAs Final Candidates List 2023 : బీఆర్ఎస్ గెలుపు గుర్రాలివే.. తొలి జాబితా ప్రకటించిన కేసీఆర్!