రాష్ట్రవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి దర్శించుకున్నార. స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ నిధులతో ఆలయాల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు.
కొండగట్టు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాం: కవిత
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్నను ఎమ్మెల్సీ కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ దర్శించుకున్నారు. ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కొండగట్టులోనూ అదే తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు కవిత వెల్లడించారు. తాను కాశీకి వెళ్లినప్పుడు సంకట హనుమాన్ ఆలయ అర్చకులు పెద్ద కార్యక్రమం చేపట్టాలని సూచించినట్లు ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగానే చిన్నహనుమాన్ జయంతి, పెద్దహనుమాన్ జయంతి మధ్యకాలంలో చేపట్టేలా ప్రణాళికను ప్రకటిస్తామన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించాలని మన రాజ్యాంగం చెబుతోందని దానికి అనుగుణంగా నడుచుకోవాలని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సూచించారు.
ఇదీ చదవండి:భూపాలపల్లిలో 8వ అదనపు జిల్లా కోర్టును ప్రారంభించిన సీజే హిమాకోహ్లీ