జగిత్యాల జిల్లాలో వరుసగా కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగిపోయి అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట కుళ్లిపోయి చేతికందని పరిస్థితి నెలకొంది. సారంగపూర్, బీర్‌పూర్ మండలాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. అర్పపల్లి, లక్ష్మీదేవిపల్లి, పెంబట్ల, రాయికల్ మండలాల్లోని రైతుల పంట పొలాలను ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పరిశీలించారు. జరిగిన నష్టం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. మునుపెన్నడూ ఇంత భారీ స్థాయిలో నష్టం జరగలేదని ప్రభుత్వం తమని ఆదుకోవాలని రైతులు కోరారు.
పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోండి: జీవన్‌రెడ్డి - jagtial district latest news
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో రైతులకు తీవ్ర పంట నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లాలోని వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. ముంపుకు గురైన మండలాల్లోని పంట పొలాలను ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పరిశీలించారు.
పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోండి: జీవన్‌రెడ్డి
రైతు వేదికల నిర్మాణాలు ఎప్పుడైనా చేసుకోవచ్చనీ, ముందుగా జరిగిన పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలని జీవన్‌రెడ్డి కోరారు. మొక్కజొన్న పంటను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలనీ, సన్నరకాలను ప్రభుత్వమే వేయాలని రైతులకు సూచించినందున క్వింటాలు రూ. 2500కి కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:వరద నీటి తంటాలు... కాలనీ వాసుల మధ్య గొడవలు