జగిత్యాల జిల్లా రైతులు మద్దతు ధర కోరుతూ శుక్రవారం మహాధర్నా చేపట్టిన నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. రైతులు స్వచ్ఛందంగా ధర్నా చేస్తా ఉంటే పోలీసులు అడ్డుకుని రైతులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
రైతుల మహాధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గృహనిర్బంధం
జగిత్యాల జిల్లాలో పోలీసులు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని గృహనిర్బంధం చేశారు. రైతులు మద్దతు ధర కోరుతూ శుక్రవారం మహాధర్నా చేపట్టిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
రైతుల మహాధర్నా నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గృహనిర్బంధం
సీఎం రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ.. రైతులను నిండా ముంచుతున్నారని విమర్శించారు. మక్కలను కొనుగోళ్లు చేయాలని, సన్న వరి రకాలను రెండు వేల అయిదు వందలకు ప్రభుత్వమే కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ఖజానా కళకళ.. పుంజుకుంటోన్న ఆర్థిక వ్యవస్థ
Last Updated : Oct 23, 2020, 2:08 PM IST