తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త ప్రభుత్వాన్ని దీవించాల్సిందిపోయి, ఎలా నడుస్తుందో చూస్తాననడం సరికాదు : జీవన్​రెడ్డి

MLC Jeevan Reddy Fires on Ex Minister KTR : అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్​పై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తాననటం విడ్డూరంగా ఉందన్నారు.

MLC Jeevan Reddy Counter To KTR
MLC Jeevan Reddy Fires on Ex Minister KTR

By ETV Bharat Telangana Team

Published : Dec 14, 2023, 3:18 PM IST

Updated : Dec 14, 2023, 3:45 PM IST

MLC Jeevan Reddy Fires on Ex Minister KTR : కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై (Congress Guarantees) మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి (Jeevan Reddy ) స్పందించారు. కొత్త ప్రభుత్వాన్ని దీవించాల్సిందిపోయి, మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తానని పేర్కొనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవగాహన లేదంటున్న కేటీఆర్​కు ఏం అవగాహన ఉందని మండిపడ్డారు. రూ. 60 వేల కోట్లు ఉన్న అప్పులను రూ.6 లక్షల కోట్లకు తీసుకెళ్లారని ఆరోపించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హమీల అమలు దిశగా పోరాటం చేద్దాం : హరీశ్‌రావు

MLC Jeevan Reddy Counter To KTR : రాష్ట్రాన్ని నిండా ముంచి ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. తమకు ప్రభుత్వం నడిపిన అనుభవం ఉందన్న ఆయన, భట్టి అనుభవంతో ఆర్థికంగా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ సమాజాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం మద్యానికి బానిసలు చేసిందని మండిపడ్డారు. దాని ద్వారా వచ్చే ఆదాయం రూ.8 వేల కోట్లు ఉంటే రూ. 40 వేల కోట్లకు తీసుకెళ్లారన్నారు. ప్రభుత్వం ఆదాయం విధానం ఇది కాదని, ప్రజా సంక్షేమమే ముఖ్యమన్నారు. బెల్టు దుకాణాలు తొలగించి అందరికీ విముక్తి కల్పిస్తామని జీవన్​ రెడ్డి పేర్కొన్నారు.

బీఆర్ఎస్​ను వీడను, కాంగ్రెస్‌ సర్కారు కూలిపోతుందనటం సరికాదు : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి

కేటీఆర్​ ఏమన్నారంటే?: కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలోని బీఆర్ఎస్ (BRS Party) శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇటీవల ఇష్టాగోష్ఠి నిర్వహించారు.

బీఆర్ఎస్ పాలనలో వనరుల దుర్వినియోగం - త్వరలోనే వ్యవస్థలన్నింటిని గాడిలో పెడతాం : ఉపముఖ్యమంత్రి భట్టి

తొలి కేబినెట్ భేటీలోనే ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడు పద్దులపై ఎలాంటి చర్చ జరగలేదని, ప్రతి ఏడాది కాగ్ నివేదికలు (CAG Reports) ఇస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా పద్దులపై శ్వేతపత్రం విడుదల చేశామని కేటీఆర్ అన్నారు.

శిలాఫలకాలను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి : వినోద్‌కుమార్‌

KTR Fires on Congress Government :రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి తమకు అప్పగించారని కాంగ్రెస్ నాయకులు అన్నారని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయన్న ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు. హస్తం పాలకులకు ఇప్పుడుంది అసలు ఆట అని కేటీఆర్ వ్యంగాస్త్రం సంధించారు.

అధికారం కోల్పోయిన ఇంకా ఆగని బీఆర్​ఎస్ నాయకుల కబ్జాలు : కొప్పుల నర్సింహా రెడ్డి

Last Updated : Dec 14, 2023, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details