ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్‌కు ఉన్న రక్షణ.. రాష్ట్రంలోని మహిళలకు లేకుండా పోయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. శంషాబాద్‌లో యువ పశువైద్యురాలిపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జీవన్‌రెడ్డి నివాసం నుంచి సాగిన ర్యాలీ తహసీల్ చౌరస్తా వరకు సాగింది. పశువైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ మౌనం పాటించారు.
'ఫాంహౌస్‌కు ఉన్న భద్రత... మహిళలకు లేదా' - mlc jeevan reddy updates
శంషాబాద్‌లో యువ పశువైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ.. జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
జగిత్యాలలో కొవ్వొత్తుల ర్యాలీ
ఇవీ చూడండి: 'చట్టాలను సవరించండి... పార్లమెంట్లో చర్చించండి'
Last Updated : Dec 2, 2019, 10:14 AM IST