ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తే రైతులకు మేలు చేకూరుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా పోరండ్ల గ్రామ రైతులు నిర్వహించిన కనుమ ఉత్సవాల్లో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. గ్రామస్థులకు కనుమ పండగ శుభాకాంక్షలను తెలిపారు.
'సంక్రాంతి పర్వదినాన్ని.. రైతు దినోత్సవంగా నిర్వహించాలి' - ధాన్యం కొనుగోలు కేంద్రాల కొనసాగింపు
జగిత్యాల మండలం పోరండ్ల గ్రామ రైతులు కనుమ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ. జీవన్‌రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.
'సంక్రాంతి పర్వదినాన్ని.. రైతు దినోత్సవంగా నిర్వహించాలి'
పాడి, పశువులకు ప్రత్యేక పూజలు చేశారు జీవన్‌రెడ్డి. అనంతరం ఎడ్లబండి నడిపారు. సంక్రాంతి పర్వదినాన్ని ప్రభుత్వం.. రైతు దినోత్సవంగా నిర్వహించాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల కొనసాగింపుపై తక్షణమే ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:భారతదేశానికి అక్షయ పాత్రగా తెలంగాణ.. ధాన్యం ఉత్పత్తిలో టాప్!