తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి - తెలంగాణ వార్తలు

ముత్యంపేట చక్కెర పరిశ్రమని మళ్లీ ప్రారంభించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటి కోసం చేపట్టిన పనులను అలాగే వదిలేశారని మండిపడ్డారు.

mlc-jeevan-reddy-about-mutyam-pet-sugar-factory-in-jagtial-district-press-meet
రైతులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

By

Published : Mar 24, 2021, 7:39 PM IST

వంద రోజుల్లో ముత్యంపేట చక్కెర పరిశ్రమను తెరుస్తామని ఎన్నికల్లో హామీలిచ్చి.. చివరకు మూసేశారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆ పరిశ్రమను మళ్లీ తెరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తెలిపేందుకు వెళ్లిన రైతులను అరెస్ట్‌ చేయడం ఎంత వరకు సమంజసమని జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ నాయకులతో కలిపి దాదాపు 500 మందిని అరెస్ట్‌ చేశారని... ఆ అరెస్టులను ఆయన ఖండించారు. రాష్ట్రంలో సాగునీరు, పరిశ్రమలకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేపట్టిన పనులను అలాగే వదిలేసిందని మండిపడ్డారు. కథలాపూర్​లోని సూరమ్మ చెరువు, కొడిమ్యాల మండలంలోని పోతారం ప్రాజెక్టు, మంథని ప్రాంతంలో చేపట్టిన సాగునీటి పనులు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.

రైతులను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదీ చదవండి:ద.మ. రైల్వే సరుకు రవాణాలో రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details