జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక పరిధిలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విద్యాసాగరరావు హాజరయ్యారు. పలుచోట్ల నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాలకు పనులను ప్రారంభించారు.
'పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి' - జగిత్యాల తాజా వార్త
పట్టణాలను పరిశుభ్రంగా ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ప్రజలందరూ భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జగిత్యాల మెట్పల్లిలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
'పట్టణ ప్రగతిని విజయవంతం చేయండి'
పట్టణ ప్రగతి కార్యక్రమంలో అధికారలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. తద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని అన్నారు. ప్రతి ఇంటి ముందు రెండు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు.
ఇవీ చూడండి: ఉరివేసుకొని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య