జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమృత సామాజిక, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రారంభించారు. మహిళలు ఇంటి వద్దనే స్వయం ఉపాధి పొందవచ్చని అన్నారు.
కుట్టు శిక్షణతో మహిళకు స్వయం ఉపాధి: విద్యాసాగర్ రావు - ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు
కుట్టు మిషన్లతో ఇంటివద్దనే ఉంటూ మహిళలు ఉపాధి పొందవచ్చని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో అమృత సామాజిక, సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

స్వయం ఉపాధికి మంచి అవకాశం : విద్యాసాగర్ రావు
ఈ కేంద్రంలో నాలుగు నెలల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్నవారికి కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పొందేవారు ముందుగా రూ.1100 చెల్లించాల్సి ఉంటుందని... వాటిని తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు.