తెలంగాణ

telangana

ETV Bharat / state

మత్స్యకారులకు ద్విచక్రవాహనాల పంపిణీ - తెలంగాణ వార్తలు

మెట్​పల్లి మత్స్యకారులకు ద్విచక్రవాహనాలను ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. మల్లాపూర్ మండలం వేంపల్లికి చెందిన 10 మంది సబ్సిడీపై అందజేశారు. ఆర్థికంగా ఎదగడానికే చేప పిల్లలనూ అందజేస్తున్నామని తెలిపారు.

mla-vidya-sagar-rao-distributie-bikes-to-fishermen-at-metpally-in-jagtial-district
మత్స్యకారులకు ద్విచక్రవాహనాల పంపిణీ

By

Published : Dec 22, 2020, 1:07 PM IST

కులవృత్తులపై ఆధారపడి జీవించే వారిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. మత్స్యకారులకు ద్విచక్రవాహనాలను పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని తెరాస కార్యాలయం ఆవరణలో మల్లాపూర్ మండలం వేంపల్లికి చెందిన 10 మంది మత్స్యకారులకు రూ.6లక్షల 69 వేల విలువగల వాహనాలు 75% సబ్సిడీపై అందజేశారు. గతంలో ఏ ప్రభుత్వం మత్స్యకారులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆరోపించారు.

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగడానికి చేప పిల్లలనూ అందజేస్తున్నామని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చేపలను సరఫరా చేయడానికి ద్విచక్రవాహనాలు అందించామని అన్నారు. ద్విచక్రవాహనాల పంపిణీ పట్ల మత్స్యకారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:రాష్ట్ర ఏర్పాటులో కాకాది కీలక పాత్ర: కిషన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details