తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు కార్యకర్తలే పునాది: సుంకె - తెలంగాణ వార్తలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధియే అజెండాగా సీఎం కేసీఆర్ పరిపాలన చేస్తున్నారని అన్నారు. తెరాసకి కార్యకర్తలు పునాది రాళ్లవంటి వారని కొనియాడారు.

mla sunke ravishankar participated in bike rally at kodimyala in jagtial
కార్యకర్తలకు తోబుట్టువులా ఉంటా: సుంకె

By

Published : Dec 29, 2020, 8:21 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో తెరాస కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. ప్రాణాలకు తెగించి ప్రత్యేక రాష్ట్రం సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్... సంక్షేమ పథకాలు, అభివృద్ధియే అజెండాగా పరిపాలన చేస్తున్నారని అన్నారు. అభివృద్ధి ప్రక్రియ నిరంతరం సాగేందుకు తెరాస శ్రేణులు ఐకమత్యంతో ఉండాలని కోరారు. కార్యకర్తలందరికీ తాను తోబుట్టువులా ఉంటానని హామీ ఇచ్చారు. తెరాసకి కార్యకర్తలు పునాది రాళ్లవంటి వారని అన్నారు.

రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటీ... భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయటం లేదన్నారు. జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో అనేక హామిలిచ్చిన భాజపా నాయకులు ఫలితాల అనంతరం వాటిని మర్చిపోయారని ఆరోపించారు. కేవలం విద్వేషాలతో భాజపా నేతలు పరిపాలన చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి:సీసీఐకి మంత్రి నిరంజన్​ రెడ్డి లేఖ

ABOUT THE AUTHOR

...view details