తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - kalyana lakshmi cheques

జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పర్యటించారు. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేశారు.

mla sunke ravi shankar
mla sunke ravi shankar

By

Published : May 3, 2021, 5:38 PM IST

సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమే తెలంగాణ రాష్ట్రమని అన్నారు ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. తెరాస ప్రభుత్వం.. అన్ని మతాలను గౌరవిస్తోందని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో.. లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు.

దసరా, రంజాన్, క్రిస్మస్ పండుగల వేళ ఆయా మతాల వారికి.. ప్రభుత్వం తరఫున ఉచితంగా బట్టలు పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు. కొవిడ్ నిబంధనలతో వేడుకలు జరుపుకోవాలని ముస్లిం సోదరులను కోరారు.

ఇదీ చదవండి:ఈటల సహా మరికొందరిపై విచారణకు ఐఏఎస్​ల కమిటీ

ABOUT THE AUTHOR

...view details