మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు కలుగొద్దని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల మార్కెట్ యార్డులో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ దావ వసంతతో కలిసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
'కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకండి' - జగిత్యాలలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం
జగిత్యాల మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ప్రారంభించారు. కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులకు అమ్మవద్దని రైతులకు సూచించారు.
'కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అమ్మకండి'
కష్టపడి పండించిన మొక్కజొన్నలను దళారులకు అమ్మవద్దని రైతులకు సూచించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో రూ.1850 ధరకు అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు ఛైర్మన్ దామోదర్ రావు, మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రావణి, అధికారులు పాల్గొన్నారు.