తెలంగాణ

telangana

ETV Bharat / state

'చివరి గింజ వరకు కొంటాం.. ఆందోళన వద్దు' - తెలంగాణ వార్తలు

జగిత్యాల పట్టణంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భుమిపూజ చేశారు. 15వ వార్డులో రూ.65లక్షలతో పలు నిర్మాణాలు చేపట్టనున్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆయన పర్యటించారు.

mla sanjay kumar visited grain purchase center, mla foundation stone for development works
ధాన్యం కొనుగోళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాలలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే భూమిపూజ

By

Published : May 9, 2021, 12:44 PM IST

జగిత్యాల పట్టణంలోని 15 వార్డులో రూ.65 లక్షలతో నిర్మించే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ భూమి పూజ చేశారు. ఈ నిధులతో డ్రైనేజీల నిర్మాణాలు, తదితర పనులు చేపట్టనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడిన ఆయన... చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. ఆందోళన అవసరం లేదని అన్నారు.

పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఇదీ చదవండి:గ్రామాల్లో విరుచుకుపడుతున్న కొవిడ్​ వైరస్​

ABOUT THE AUTHOR

...view details