జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పర్యటించారు. నూకపల్లి అర్బన్ కాలనీ న్యాక్ సెంటర్ సమీపంలో రూ. 54 లక్షలతో నిర్మించే తడి, పొడి చెత్త వనరుల సేకరణ కేంద్రానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
తడి, పొడి చెత్త సేకరణ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
జగిత్యాలలోని నూకపల్లి అర్బన్ కాలనీ న్యాక్ సెంటర్ సమీపంలో రూ. 54 లక్షలతో నిర్మించే తడి, పొడి చెత్త వనరుల సేకరణ కేంద్రానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. పట్టణం నుంచి వెలువడే చెత్తను వేరు చేసి ఈ కేంద్రంలో రీసైక్లింగ్ చేయటం జరుగుతుందని పేర్కొన్నారు. సెప్టిక్ ట్యాంకు నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా కూడా ఎరువు తయారవుతుందన్నారు.
తడి, పొడి చెత్త సేకరణ కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
పట్టణం నుంచి వెలువడే చెత్తను వేరు చేసి ఆ కేంద్రంలో రీసైక్లింగ్ చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సెప్టిక్ ట్యాంకు నుంచి వచ్చే వ్యర్థాల ద్వారా కూడా ఎరువు తయారవుతుందన్నారు. పట్టణాన్ని పారిశుద్ధ్యంగా మార్చే కార్యక్రమాలను చేపడుతున్నట్లు డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:భాజపా ఎంపీలు తప్పుడు ప్రకటనలు మానుకోవాలి: ఎమ్మెల్యే సంజయ్
Last Updated : Sep 24, 2020, 10:53 PM IST