తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతు బీమా ప్రొసీడింగులు అందజేసిన ఎమ్మెల్యే - ఎమ్మెల్యే రవిశంకర్​ తాజా వార్తలు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్, సండ్రపల్లి గ్రామాల రైతులు మల్యాల వెంకటి, తైదల లక్ష్మణ్ మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రొసీడింగులను ఎమ్మెల్యే రవిశంకర్ అందజేశారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

రైతు బీమా ప్రొసీడింగులు అందజేసిన ఎమ్మెల్యే
రైతు బీమా ప్రొసీడింగులు అందజేసిన ఎమ్మెల్యే

By

Published : Sep 19, 2020, 9:38 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిరుమలాపూర్, సండ్రపల్లి గ్రామాల రైతులు మల్యాల వెంకటి, తైదల లక్ష్మణ్ మృతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రొసీడింగులను ఎమ్మెల్యే రవిశంకర్ అందజేశారు.

రైతు కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశపెట్టారని వారు తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా రైతు బీమా అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. దీనికోసం ప్రభుత్వమే ప్రతి ఏటా రూ. 3 వేల కోట్ల బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. తిర్మలాపుర్‌లో అనారోగ్యంతో మృతి చెందిన తెరాస నాయకుడు రమణారెడ్డి కుటుంబానికి రూ. 20 వేల నగదును ఎమ్మెల్యే రవిశంకర్‌ అందజేశారు.

ఇదీ చదవండి:రైతు బీమా నమోదుకు గడువు రెండు రోజులే...

ABOUT THE AUTHOR

...view details