మున్సిపల్ ఎన్నికల తేదీ ప్రకటనతో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది. జగిత్యాల జిల్లా మెట్పల్లి బల్దియాలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారాన్ని కొనసాగించారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు వేయాలని వేడుకున్నారు.
ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే - ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బజ్జీలు వేస్తూ ఓటర్లను ఆకట్టుకున్నారు.

ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే
ఇప్పటి వరకు పట్టణంలో చేసిన అభివృద్ధితో పాటు ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి తెరాస అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హోట్ల్కి వెళ్లి బజ్జీలు చేశారు.
ప్రచారంలో భాగంగా బజ్జీలు వేసిన కోరుట్ల ఎమ్మెల్యే
ఇవీ చూడండి: ఆటోను ఢీకొన్న ఇసుక లారీ... విద్యార్థి మృతి