MLA Jeevan Reddy Letter To CM Revanth Reddy : తెలంగాణలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ రాశారు. రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ (KCR) నియంతృత్వ ధోరణిలో పాలన కొనసాగిందని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి ఉద్యమ లక్షణాలను నీరు కార్చారని విమర్శించారు.
పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు - అధిష్ఠానం ఏ బాధ్యత అప్పగించినా శిరసా వహిస్తా : జీవన్‌రెడ్డి
కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. అందుకే ప్రజలు మార్పు రావాలని కోరుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. తెలంగాణలో ఇస్తే సీమాంధ్రలో 20 సీట్లు కోల్పోతామని తెలిసి కూడా కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) తెలంగాణ ఏర్పాటుకు కృషి చేశారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొన్నారు.
MLC Jeevan Reddy letter To CM Revanth on Illegal Liquor Shops : ఆరోగ్య శ్రీని కొనసాగించడం, మహిళలకు ఆర్థిక వెసులుబాటు విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు లబ్ధి చేకూరిందన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తక్షణమే తొలగించాలనడం హర్షనీయమన్నారు. ఎక్సైజ్ శాఖ రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఆదాయ శాఖగా మారిందని మండిపడ్డారు.