తెలంగాణ

telangana

ETV Bharat / state

సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో ఎమ్మెల్యే - latest news on mla vidyasagar rao

సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకుని జగిత్యాలలోని అయ్యప్ప ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు హాజరయ్యారు.

MLA in the service of Subrahmanyeswara
సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో ఎమ్మెల్యే

By

Published : Dec 2, 2019, 11:35 AM IST

నేడు సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి విశేష పూజలు నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరై... స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.

పలువురు అయ్యప్ప దీక్షాపరులు సైతం పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి వారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.

సుబ్రహ్మణ్యేశ్వరుని సేవలో ఎమ్మెల్యే

ఇదీ చూడండి: తమిళనాట వరుణ బీభత్సం.. జనజీవనం అతలాకుతలం

ABOUT THE AUTHOR

...view details