తెలంగాణ

telangana

ETV Bharat / state

పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్​.. తడిచిన పుస్తకాలు - పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్​

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మైనార్టీ గురుకులం సమీపంలో మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలిపోయింది. ఓ వ్యక్తి బోర్​ వేసేందుకు ప్రయత్నించడం వల్ల పక్కనే ఉన్న మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలిపోయింది. అక్కడి నుంచి నీరు ఎగిసిపడుతూ పక్కనే ఉన్న గురుకులంలోని చేరింది. విద్యార్థుల పుస్తకాలు తడిచిపోయాయి.

పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్​.. తడిచిన పుస్తకాలు

By

Published : Jul 24, 2019, 10:37 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి మైనార్టీ గురుకుల పాఠశాల వద్ద మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలిపోయింది. గురుకులం సమీపంలో ఓ వ్యక్తి బోర్​ వేసేందుకు యంత్రాలతో ప్రయత్నించడం వల్ల పైప్​లైన్​ పగిలిపోయింది. వందలాది లీటర్ల తాగునీరు రోడ్డుపై వృథాగా ప్రవహించింది. పైప్​లైన్​ నుంచి నీరు ఎగిసిపడుతూ పక్కనే ఉన్న గురుకులంలోకి నీరు చేరింది. విద్యార్థుల పుస్తకాలు, దుస్తులు తడిచిపోయాయి. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మరమత్తు చర్యలు చేపట్టారు.

పగిలిన మిషన్​ భగీరథ పైప్​లైన్​.. తడిచిన పుస్తకాలు

ABOUT THE AUTHOR

...view details