రైతులను సంఘటితం చేసేందుకే సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణం చేపట్టారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట, కొత్తదామురాజుపల్లి, మల్లాపూర్ తదితర గ్రామాల్లో నిర్మించిన రైతు వేదకలను మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రారంభించారు.
రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు: మంత్రి - మంత్రి నిరంజన్ రెడ్డి వార్తలు
జగిత్యాల జిల్లాలో మంత్రులు నిరంజన్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు నిర్మించి.. రైతు బంధు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెరాసనేని తెలిపారు.
జగిత్యాలలో మంత్రుల పర్యటన... రైతు వేదికలు ప్రారంభం
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనతో నిర్మించారన్నారు. వేదికల ద్వారా పంటల సాగు వివరాలు, పంటల దిగుబడుల కోసం సలహాలు, సూచనల కొరకు పంటల ధరల తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. రైతులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి:సమాన అవకాశాలతోనే సమతూకం సాధ్యం: కేటీఆర్