కొండగట్టులో వానరాలకు పండ్లు పంపిణీ - food distribution
లాక్డౌన్ కారణంగా కొండగట్టు పరిసరాల్లో ఆకలితో అలమటిస్తోన్న మూగజీవాలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి పండ్లు అందజేశారు. తన కూతురుతో కలిసి వానరాల ఆకలి తీర్చారు.
వానరాలకు పండ్లు అందజేసిన మంత్రి సతీమణి, కూతురు
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు పుణ్యక్షేత్ర పరిసరాల్లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సతీమణి, కొప్పుల ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ స్నేహలతతో కలిసి వానరాలకు పండ్లు, కూరగాయలు అందజేశారు. లాక్డౌన్ కారణంగా ఆలయాలు మూసివేయటం వల్ల కొండగట్టులోని వానరాలకు ఆహారం లేక అలమటిస్తున్నాయని మంత్రి సతీమణి ఆవేదన వ్యక్తం చేశారు. పండ్లు, ఆహారపదార్థాలు అందించి కొంతమేరకు ఆకలి తీర్చుతున్నమని తెలిపారు.