కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ పనులలో అలసత్వం వహిస్తే సహించేది లేదని మంత్రి ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రాజేశ్వరరావుపేట వద్ద జరుగుతున్న కాళేశ్వరం నిర్మాణాలను స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో జాప్యంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యతో పనులు ఆలస్యం అవుతున్నాయని అధికారులు మంత్రికి తెలిపారు. నిర్మాణాలను వేగవంతం చేసి ఆగస్టు 5 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
కాళేశ్వరం పనుల్లో జాప్యంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం - వేముల ప్రశాంత్‌రెడ్డి
జగిత్యాల జిల్లా మెట్పల్లి జిల్లా రాజేశ్వరరావుపేట వద్ద జరుగుతున్న కాళేశ్వరం రివర్స్‌పంపింగ్ పనులను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పరిశీలించారు. నిర్మాణాల్లో జాప్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 5 నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు.
కాళేశ్వరం పనుల్లో జాప్యంపై మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆగ్రహం