రైతులు కేవలం వరి మాత్రమే కాకుండా.. పెట్టుబడి, నీరు, కరెంటు వినియోగం తక్కువగా ఉండే ఇతర పంటలను పండించాలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో.. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు. కందులు, మక్క, పత్తి, ఇతర పంటల ద్వారా వచ్చే లాభాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
Minister Niranjan: 'పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించండి' - review meeting on crop rotation
ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా ప్రోత్సహిస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో.. వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించారు.
చెరుకు పంటను ప్రైవేటు వారికి అమ్ముకోవద్దని మంత్రి సూచించారు. మహరాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర రైతుల మాదిరిగా.. ఓ సహకార సంఘంగా ఏర్పడి పంట అమ్ముకుంటే మంచి లాభాలు వస్తాయని వివరించారు. రైతులు సన్నరకాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల.. ధాన్యం రాశులు పెరిగిపోయే అవకాశం ఉందన్నారు. వానాకాలం, యాసంగిలో కేవలం వరిధాన్యమే 3 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడంతో.. గోదాముల విషయంలో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు.
ఇదీ చదవండి:ఫ్రీగా ఇస్తానన్న రైతు- మార్కెట్ ధరకు కొన్న సైన్యం