తెలంగాణ

telangana

ETV Bharat / state

దావోస్​ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం - Investments for Telangana during KTR tour Davos

KTR Davos Tour Updates: దావోస్‌లో మంత్రి కేటీఆర్‌ పెట్టుబడుల వేట కొనసాగుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో మూడు డేటా సెంటర్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మరోవైపు వెబ్​పీటీ అనే సంస్థ రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో కొత్త కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధంగా ఉన్నామని పేర్కొంది.

Minister KTR Davos Tour
Minister KTR Davos Tour

By

Published : Jan 19, 2023, 7:29 PM IST

KTR Davos Tour Updates: రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే ధ్యేయంగా దావోస్ పర్యటనలో ఉన్న కేటీఆర్.. పలువురు వ్యాపార దిగ్గజాలు, సీఈవోలతో సమావేశమవుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మరో మూడు డేటా సెంటర్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని మైక్రోసాఫ్ట్‌ సంస్థ తెలిపింది. మైక్రోసాఫ్ట్ సంస్థ తన మొదటి క్యాప్టివ్ డేటా సెంటర్2022 ప్రారంభంలో.. హైదరాబాద్​లో మూడు క్యాంపస్‌లను ప్రకటించింది.

ప్రస్తుతం తెలంగాణలో 6 డేటా సెంటర్‌లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే మిగతా 3 కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో ఒక్కో డేటా సెంటర్ సగటున 100 మెగావాట్ల ఐటీ లోడ్‌ను అందిస్తోందని తెలిపింది. దశల వారీగా.. మొత్తం 6 డేటా సెంటర్​ల ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు దావోస్‌లోని మైక్రోసాఫ్ట్ కేఫ్‌లో ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి కేటీఆర్‌, ఐటీ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, మైక్రోసాఫ్ట్‌ ఆసియా అధ్యక్షుడు అహ్మద్ మజర్​ ఇందుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. మైక్రోసాఫ్ట్ తెలంగాణలో డేటా సెంటర్​ల కోసం ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ కేంద్రం: హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెబ్‌పీటీ సంస్థ తెలిపింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో.. వెబ్‌పీటీ సంస్థ ఒప్పందం కుదిరింది. అమెరికాలోని ఫీనిక్స్ కేంద్రంగా ఈ సంస్థ పనిచేస్తుంది. రూ.150 కోట్లతో హైదరాబాద్‌లో కొత్త కేంద్రం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వైద్య సంస్థలకు, ఔట్ పేషెంట్, రీహాబిలిటేషన్ థెరపీలో డిజిటల్‌ సేవలను ఈ సంస్థ అందిస్తోంది.

ప్రపంచంలోనే ముందంజలో ఉన్న భారత్: ఔషధ రంగంలో ప్రపంచంలోనే ముందంజలో ఉన్న భారత్.. జనరిక్ ఔషధాలను ఉత్పత్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దావోస్ లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ప్రసంగించిన మంత్రి.. బయోటెక్నాలజీ, డేటా సైన్స్ వినియోగం వల్ల రోగులకు సేవలందించడం సులభతరమైందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

బయోటెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు.. ఆహారం, ఔషధాలు, సంబంధిత వస్తువుల తయారీకి ఎంతో దోహదపడుతోందని కేటీఆర్ తెలిపారు. సాంకేతికతను అన్ని రంగాలకు విస్తరించడంలో తెలంగాణ ముందుందని వెల్లడించారు. కోవిడ్ టీకాను భారత్ బయోటెక్ ఆవిష్కరించిందని.. క్రమంగా ఇతర కంపెనీలు సాంకేతికతను అందిపుచ్చుకొని కోవిడ్ టీకాను అందుబాటులోకి తీసుకొచ్చాయని కేటీఆర్ వివరించారు.

ఇవీ చదవండి:దావోస్​లో పెట్టుబడుల ప్రవాహం రూ2వేల కోట్లతో ఎయిర్​టెల్ డేటా సెంటర్

బీఆర్​ఎస్ సభ చూసి బండి సంజయ్ బ్రెయిన్ ఫెయిల్‌ అయింది: ప్రశాంత్​రెడ్డి

ఏకంగా సెల్​ టవర్​నే చోరీ చేసిన దొంగలు.. నాలుగు నెలల తర్వాత..

ABOUT THE AUTHOR

...view details