జగిత్యాల జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఉద్యమంలా నిర్వహించాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడీయో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో 2 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేసామని మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాలో వ్యాక్సినేషన్ విజయవంతంగా నిర్వహించడంలో స్థానిక ప్రజాప్రతినిధులు సంపూర్ణ సహకారం అందించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. కరోనా నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకోవడానికి రోజుకు 3 లక్షల మందికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇచ్చేలా సీఎం కేసీఆర్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం చేయడంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి నూటికి నూరుశాతం వ్యాక్సిన్ అందించాలని కొప్పుల ఈశ్వర్ తెలిపారు.