జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కేంద్రంలో రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులను డ్రా పద్ధతిలో ఎంపిక చేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు లభించని వారు నిరాశ చెందవద్దని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి 11వేల కోట్ల రూపాయలు కేటాయించి లబ్ధిదారుల సొంత స్థలాల్లోనే ఇళ్లు నిర్మించేందుకు నిర్ణయించిందని వెల్లడించారు. పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి కేసీఆర్ సాకారం చేస్తున్నారని మంత్రి అన్నారు.
'సాగునీటి కల్పనపై జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు అవాస్తవం' - minister koppula inaugurated double bed rooms
సాగునీటి కల్పనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రజలకు అవాస్తవాలు చెప్పడం సరికాదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ఏడాది యాసంగిలో లక్షా ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి సాధించామని తెలిపారు.
కొడిమ్యాలలో రెండు పడక గదుల ఇళ్లు ప్రారంభం
సాగునీటి కల్పనపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ అవాస్తవాలు చెప్పడం సరికాదని మంత్రి కొప్పుల అన్నారు. యాసంగిలో లక్షా ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి సాధించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఈ స్థాయిలో పంట దిగుబడి ఎందుకు సాధించలేదని ప్రశ్నించారు.