తెలంగాణ సర్కారు చేపట్టిన చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరంగా మారిందన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. మునుపెన్నడూ ఇలాంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వాలు చేపట్టలేదని అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగం చెరువులో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ ఛైర్‌పర్సన్ దావ వసంతతో కలిసి చేప పిల్లలను వదిలారు.
'చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరంగా మారింది' - మంత్రి కొప్పుల ఈశ్వర్ వార్తలు
జగిత్యాల జిల్లా లింగం చెరువులో మంత్రి కొప్పుల ఈశ్వర్ చేప పిల్లలను వదిలారు. చేప పిల్లల పంపిణీ మత్స్యకారులకు వరంగా మారిందన్నారు. ఈసారి కురిసిన వర్షాలకు రిజర్వాయర్లు, చెరువులు నిండటం వల్ల రైతులకు మూడు పంటలకు నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేశారు.
koppula
ఈసారి ఆశాజనకంగా వర్షాలు కురవడం వల్ల రిజర్వాయర్లు, చెరువులు నిండాయని మంత్రి అన్నారు. రైతులకు మూడు పంటలకు నీరు అందుతుందని పేర్కొన్నారు. చెరువులు, కుంటలు నిండటం వల్ల మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని మంత్రి వెల్లడించారు.