రాష్ట్రంలోని ప్రతి పల్లె సుందరీకరణ కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా బుగ్గారంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
యశ్వంతరావుపేటలోని ప్యాట చెరువును పరిశీలించిన మంత్రి.. చెరువు పునరుద్ధరణ కోసం రూ. 2 కోట్ల 60 లక్షలతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు. అనుమతులు రాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.