జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి తీరం పరిశుభ్రంగా… పచ్చదనంతో కనిపించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న ప్రారంభమయ్యే హరితహారానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
గోదావరి నదీ తీరాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల - గోదావరి నదీ తీరాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకున్నారు. అనంతరం గోదావరి నదీ తీరాన్ని పరిశీలించి... పుష్కర ఘాట్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.
గోదావరి నదీ తీరాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
మురుగు నీరు గోదావరిలో కలవకుండా నిర్మిస్తున్న మహాకాలువ నిర్మాణ పనులు నెలలోగా పూర్తి అయ్యేలా చూడాలన్నారు. ఫుష్కర ఘాట్ల వద్ద పారిశుధ్యం అధ్వానంగా ఉన్నందున మున్సిపల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగా పని చేయకుంటే సస్పెండ్ చేయిస్తానని మంత్రి హెచ్చరించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో ఐదు వేలకు చేరువలో కరోనా కేసులు