దేశం అజ్ఞానుల పాలనలో నడుస్తుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా పెద్దపెల్లి జిల్లా ధర్మారం, జగిత్యాల జిల్లా వెలగటూరు, రాయపట్నం వద్ద 63వ నెంబర్ జాతీయ రహదారిపై ధర్నాలో మంత్రి పాల్గొన్నారు.
అజ్ఞానుల పాలనలో దేశం: కొప్పుల ఈశ్వర్ - రైతులకు మద్దతుగా కొప్పుల ఈశ్వర్
రైతులు తలపెట్టిన భారత్ బంద్ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. కేంద్రంపై విమర్శలు చేసిన ఆయన... సాగు వ్యతిరేక చట్టాలను ప్రతి రైతు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.
అజ్ఞానుల పాలనలో దేశం: కొప్పుల ఈశ్వర్
సాగు వ్యతిరేక చట్టాలను ప్రతి రైతు గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. మత ప్రాతిపదికన దేశాన్ని విభజించడం తప్ప భాజపాకు ఏది చేత కాదని పేర్కొన్నారు. ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించగా... పోలీసులు పునరుద్ధరించారు.
ఇదీ చూడండి:రైతుల నడ్డివిరిచే విధంగా మోదీ పాలన: ఎమ్మెల్సీ కవిత