జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని అంబేడ్కర్ విగ్రహాన్ని ఆయన ప్రారంభించారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ నడవాలని సూచించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని యువత ముందుకు వెళ్లాలన్నారు.
'వారి ఆశయాలకు అనుగుణంగా నడిచిరోజే నిజమైన నివాళి' - జ్యోతిరావు పూలే వార్తలు
అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి... అణగారిన వర్గాల అభివృద్ధికి అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే, అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా నడిచిన రోజే వారికి ఘనమైన నివాళి ఇచ్చినట్లన్నారు.
'వారి ఆశయాలకు అనుగుణంగా నడిచిరోజే నిజమైన నివాళి'
దేసంలో అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడి... అణగారిన వర్గాల అభివృద్ధికి అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని మంత్రి తెలిపారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యారంగాన్ని అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోతున్నామన్నారు. అనంతరం తక్కళ్లపల్లి గ్రామంలో రూ.16 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎరువుల గోదాంను మంత్రి ప్రారంభించారు.
ఇదీ చూడండి:కేటీఆర్ వచ్చే వేళాయే.. సుందరంగా ముస్తాబవుతోన్న వరంగల్