తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి - jagityal news

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో దివ్యాంగులకు మంత్రి కొప్పుల ఈశ్వర్​ ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. దివ్యాంగులకు రెండు పడక గదుల ఇళ్లను ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

minister koppula eshwar distributed tri cycle to phc
minister koppula eshwar distributed tri cycle to phc

By

Published : Sep 24, 2020, 2:26 PM IST

దివ్యాంగులకు తెరాస ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 32 మంది దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లాలో మొత్తం 389 మందికి ట్రై సైకిళ్ళను పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.

దివ్యాంగులకు రెండు పడక గదుల ఇళ్లను ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో సైకిళ్లను పంపిణీ చేశామన్నారు. రాష్ట్రమంతటా పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతామని తెలిపారు. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అందించిన అంబులెన్సును మంత్రి ఈశ్వర్ ప్రారంభించారు.

ఇదీ చూడండి: జీవితమంతా అక్కడే.. చివరి చూపు కోసం కుటుంబసభ్యులు

ABOUT THE AUTHOR

...view details