తెలంగాణ

telangana

ETV Bharat / state

'వానకాలంలో సన్న రకాలను సాగుచేయండి' - జగిత్యాల తాజా వార్త

వానకాలంలో రైతులు సన్న రకాలను సాగు చేయాలని.. ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొంటుందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ రైతులను కోరారు. జగిత్యాల జిల్లాలో చేపట్టబోయే వానకాలం సాగుపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

minister koppula conducted rain season review meet in jagityala
'వానకాలంలో సన్న రకాలను సాగుచేయండి'

By

Published : May 9, 2020, 12:55 PM IST

జగిత్యాల జిల్లా జయశంకర్‌ యూనివర్శిటీ పొలాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో ఏర్పాటు చేసిన వానకాలం సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌తోపాటు, శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు, ప్రజా ప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. ఈ సీజన్‌లో చేపట్టబోయే పంటల పరిస్థితిపై మంత్రి సమీక్షించారు.

రైతులు ఒకే రకం పంట వేయకుండా పంట మార్పిడి చేయాలని మంత్రి సూచించారు. ఈ వానకాలంలో పంట దిగుబడి మరింత సాధించాలని... ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచిందన్నారు. అన్ని రంగాల్లో రైతులను ఆదుకునేందుకు తెరాస ప్రభుత్వం ముందుంటుందన్నారు. రుణమాఫీ, రైతు బంధు రైతులకు అందిస్తుందన్నారు.

ఇవీ చదవండి...విశాఖ వాసులను వెంటాడుతున్న విషవాయువు...!

ABOUT THE AUTHOR

...view details