ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నిర్మిస్తున్న శాసనసభ్యుల అధికారిక నివాస భవనాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌తో కలిసి శాసనసభ్యుని అధికారిక నివాస భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఎమ్మెల్యే అధికారిక నివాస భవనాన్ని ప్రారంభించిన మంత్రి - జగిత్యాల జిల్లా వార్తలు
జగిత్యాల జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ధర్మపురిలో ఎంపీ వెంకటేశ్‌తో కలిసి శాసనసభ్యుని అధికారిక నివాస భవనాన్ని ప్రారంభించారు. ప్రజలకు సేవలందించేందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు.
![ఎమ్మెల్యే అధికారిక నివాస భవనాన్ని ప్రారంభించిన మంత్రి minister koppala inaugurated mla official residencies in dharmapuri](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9843998-133-9843998-1607688906362.jpg)
ఎమ్మెల్యే అధికారిక నివాస భవనాన్ని ప్రారంభించిన మంత్రి
నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరు తమ అవసరాల మేరకు అధికారిక నివాసంలోనే తమ పనులను చేసుకోవాలన్నారు. ప్రజలకు సేవలందించేందుకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించామన్నారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు మొరాయిస్తున్న సర్వర్లు