జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన కొక్కుల రాజేందర్ అనే యువకుడు సొంత ఊళ్లో ఉపాధి దొరకక 2018లో ఓ ఏజెంట్ సాయంతో ఒమన్‌కు చేరుకున్నాడు. అక్కడ కూడా ఉపాధి లభించకపోవడం వల్ల నడకమార్గంలో ఒమన్ నుంచి మస్కట్ సరిహద్దు దాటి దుబాయికి వెళ్లాడు. అక్కడ కూలీ పనులు చేసుకుంటూ ఇన్నాళ్లు బతికాడు. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి, అక్రమ మార్గంలో దుబాయికి వెళ్లడం వల్ల స్వదేశానికి రాలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
ఉపాధి కోసం సరిహద్దు దాటి.. ఎట్టకేలకు ఇల్లు చేరాడు! - migrant labor reached jagtial from dubai
ఉన్న ఊళ్లో ఉపాధి లేక.. దేశం కాని దేశం వెళ్లి లాక్డౌన్ వల్ల అక్కడే చిక్కుకుపోయిన ఓ వలస కార్మికుడు ప్రవాస మిత్ర సాయంతో ఎట్టకేలకు సొంతూరు చేరాడు. రెండేళ్ల క్రితం వెళ్లిన తమ కుమారుడు ఇంటికి చేరుకోవడం వల్ల ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
దుబాయ్ నుంచి జగిత్యాలకు చేరుకున్న వలస కార్మికుడు
ఈ విషయం ప్రవాస మిత్ర లేబర్ యూనియన్‌కు తెలపగా.. విదేశీ మంత్రిత్వ శాఖ దుబాయిలోని రాయబార కార్యాలయ దృష్టికి తీసుకెళ్లింది. రాయబార కార్యాలయ అనుమతులు పొంది ఎట్టకేలకు రాజేందర్.. తన ఇంటికి చేరుకున్నాడు. రెండేళ్ల క్రితం ఉపాధి కోసం వెళ్లిన తమ కుమారుడు.. ఇంటికి చేరడం వల్ల అతని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి'అద్దె బస్సులను నడిపేందుకు అనుమతివ్వాలి'