జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారానికి చెందిన తట్రరాజం పొట్టకూటి కోసం మలేషియా వెళ్లాడు. ఈనెల 6న కూలీ పని చేస్తుండగా తలకు క్రేన్ తగిలి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడి పరిస్థితి ఎలా ఉందో అంటూ తల్లడిల్లుతున్నారు. స్వదేశానికి రప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌ను కలిసి వేడుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ సత్వరమే స్పందించి స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని అతని భార్య మమత కోరుతోంది.
మలేషియా వెళ్లి కోమాలో వలస కూలీ -
పొట్టకూటి కోసం కుటుంబాన్ని వదిలి వలసవెళ్లాడు ఆ వ్యక్తి. దేశంకాని దేశంలో కూలీ పని చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడి కోమాలోకి వెళ్లాడు. అతన్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
మలేషియా వెళ్లి కోమాలో వలస కూలీ