Micro Art : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ అతిసూక్ష్మ శివలింగాన్ని తయారు చేశారు. కేవలం శివలింగమే కాకుండా.. లింగం చుట్టూ ప్రకృతి అందాలు.. మంచు పర్వతాలను.. శివుని మెడలో ఉండే నాగుపామును కూడా రూపొందించారు.
Micro Art : గుండుపిన్నుపై శివలింగం.. చుట్టూ మంచుపర్వతాలు
Micro Artist : మహాశివరాత్రి పర్వదినం సమీపిస్తోంది.. రాష్ట్రంలోని శివాలయాలన్నీ ఈ మహాపర్వదినాన్ని వేడుకలా నిర్వహించడానికి సిద్ధమవుతున్నాయి. మరోవైపు కొందరు కళాకారులు.. మహాశివరాత్రిని పురస్కరించుకుని పరమశివుడి ప్రాశస్త్యాన్ని తెలిపే పలు కళాకృతులను రూపొందిస్తున్నారు. జగిత్యాలకు చెందిన సూక్ష్మకళాకారుడు గుర్రం దయాకర్ గుండుపిన్నుపై అతిసూక్ష్మ శివలింగాన్ని రూపొందించారు.
Micro Art
0.3 మి.మీ. శివలింగం..
Micro Artists : ఈ సూక్ష్మ విగ్రహాన్ని రూపొందించడానికి 8 గంటలు పట్టినట్లు దయాకర్ తెలిపారు. శివలింగం సైజు 0.3 మిల్లీమీటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే అనేక సూక్ష్మ కళలను రూపొందించిన దయాకర్.. సూక్ష్మకళాకారుల అభివృద్ధికి చేయూతనందించి.. ఈ కళను ప్రోత్సహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.