తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు జగిత్యాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన సిబ్బంది ఆందోళన చేశారు. సర్క్యులర్ 4779ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు.
కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు - కలెక్టరేట్‌ను ముట్టడించిన ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు
జగిత్యాల కలెక్టర్ కార్యాలయాన్ని ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు ముట్టడించారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలంటూ ఆందోళన చేశారు.
FIELD ASSISTANCE PROTEST IN FRONT OF JAGITYAL COLLECTORATE
ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం రూ. 21 వేలకు పెంచాలని కోరారు. అనంతరం ప్రజావాణిలో సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.