తెలంగాణ

telangana

ETV Bharat / state

వీధుల్లో ముళ్ల కంచెలు.. అత్యవసరమైతే అంతే.! - coronavirus updates

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఓ పక్క అధికారులు అప్రమత్తం అవుతుంటే మరోపక్క ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడంలో ముందున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక పరిధిలోని పలు వీధుల్లో ప్రజలు ముళ్ల కంచెలు ఇనుప చువ్వలు బండరాళ్లు అడ్డుపెట్టారు.

metpally people precautions to avoid corona in jagityala
వీధుల్లో ముళ్ల కంచెలు

By

Published : Mar 26, 2020, 11:41 AM IST

గ్రామ సరిహద్దుల్లో ముళ్ల కంచెలు వేయడం చూశాం. కానీ ఇప్పుడు వీధుల్లో కూడా ముళ్ల కంచెలు వేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలిక పరిధిలోని పలు వీధుల్లో ప్రజలు ముళ్ల కంచెలు ఇనుప చువ్వలు బండరాళ్లు, కర్రలు అడ్డుపెట్టారు. కొత్త వారిని లోపలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు.

మెట్​పల్లిలో ఏ వీధికి వెళ్లాలన్నా ఇప్పుడు ముళ్ల కంచెలే కనబడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే వీధుల్లోకి ఆంబులెన్స్ రావడం కష్టంగా మారే అవకాశం ఉంది.

వీధుల్లో ముళ్ల కంచెలు

ఇదీ చూడండి: సుఖీభవ: ఆయుర్వేదంతో కరోనాను అరికట్టవచ్చా?

ABOUT THE AUTHOR

...view details