జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం సందర్భంగా గౌడసంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని చావిడి ప్రాంతం వద్ద భారీ సంఖ్యలో మహిళలు బోనంతో వచ్చి దేవత భక్తి శ్రద్ధలతో సమర్పించారు. బోనం ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. బోనాల వేడుక సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని అమ్మవారి బోనాన్ని నెత్తిన ఎత్తుకుని భక్తి భావాన్ని చాటారు. పట్టణంలో పురవీధుల గుండా బోనాలను ఊరేగించి పట్టణ శివారులోగల రేణుక ఎల్లమ్మ ఆలయం వద్దకు తీసుకెళ్లి బోనాలను అమ్మవారికి సమర్పించారు. అనంతరం రోజంతా ఉపవాస దీక్షలు ఉన్న మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈవేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హజరయ్యారు.
మెట్‌పల్లిలో ఘనంగా బోనాల ఉత్సవాలు - metpally
మెట్‌పల్లిలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు ఘనంగా జరిగాయి. డప్పు చప్పుల్ల మధ్య, ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనం సమర్పించారు.
మెట్‌పల్లిలో ఘనంగా బోనాల ఉత్సవాలు