జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పురపాలిక పరిధిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవాలంటూ భాజపా, కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలిక అనుమతులు లేకుండా భవంతులు నిర్మిస్తూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. అవినీతిని ఎందుకు అడ్డుకోవడం లేదంటూ పురపాలిక సర్వసభ్య సమావేశానికి హాజరయైన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ముందు కౌన్సిలర్లు అధికారులపై విరుచుకుపడ్డారు.
అవినీతి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు - తెలంగాణ వార్తలు
మెట్‌పల్లి పురపాలిక పరిధిలో జరుగుతున్న అవినీతిని అడ్డుకోవాలంటూ భాజపా, కాంగ్రెస్ కౌన్సిలర్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలిక అనుమతులు లేకుండా భవంతులు నిర్మిస్తూ లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయని ఆరోపించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావును కోరారు.
అవినీతి అధికారులపై ఆగ్రహం
పట్టణంలో పుర అనుమతులు లేకుండా 182 నిర్మాణాలు జరిగాయని ఎమ్మెల్యేకు తెలిపారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. దీంతో తెరాస, భాజపా, కాంగ్రెస్ కౌన్సిలర్లతో కూడిన కమిటీ వేసి వెంటనే అనుమతులు లేని భవంతులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశించారు.