మెట్పల్లిలో గోరింటాకు సంబురాలు - mehendi celebrations
ఆషాడం వచ్చిందంటే చాలు ఆడపడుచులంతా ఒక్కచోట చేరి గోరింటాకు సంబరాల్లో మునిగి తేలుతారు. గోరింటాకుతో అందంగా కన్పించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతో మగువలు గోరింటాకు సంబురాలు చేసుకుంటారు.
mehendi celebrations at metpally in jagityal district
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో వాసవి వనిత క్లబ్ మహిళలు గోరింటాకు సంబురాలు జరుపుకున్నారు. పేదలకు నిత్యావసర వస్తువులతో పాటు చిన్నారులకు నిఘంటువులు పంపిణీ చేశారు. అనంతరం గోరింటాకును దంచి అందరూ ఒకచోట చేరి చేతులకు పెట్టుకుని మురిసిపోయారు. గోరింటాకు పాటలు పాడుతూ సందడి చేశారు.
- ఇదీ చూడండి : నిబంధనలకు విరుద్ధంగా బోర్లు తవ్వుతున్నారు