జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్య వైశ్య మహిళలు ఆషాఢమాస వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహిళా మణులు వాసవి మాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పాటలు పాడుతూ గోరింటాకు దంచారు. ఒకరికొకరు గోరింటాకు పెట్టుకుంటూ మురిసిపోయారు. వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆషాఢ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించుకున్నారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు డ్రా తీసి వాసవి మాత చీరలను బహుమతులుగా అందించారు. మహిళామణులు తమ అభిప్రాయాలను ఇతరులకు వెలిబుచ్చుతూ గోరింటాకు సంబురాలను కోలాహలంగా జరుపుకున్నారు.
ఆనందోత్సాహాల మధ్య గోరింటాకు సంబురాలు - MEHANDHI FESTIVAL CELEBRATIONS IN METPALLY
ఆషాఢమాసం వచ్చిందంటే చాలు... మహిళలంతా ఒక్కచోట చేరి అరచేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోతుంటారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆనందోత్సాహాల మధ్య గోరింటాకు సంబురాలు జరుపుకున్నారు మహిళలు.
MEHANDHI FESTIVAL CELEBRATIONS IN METPALLY
TAGGED:
aashadam